కొవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆ మేరకు ఆసుపత్రుల సంఖ్య, పడకలు పెంచేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అయినప్పటికీ కొన్ని చోట్ల వైద్యం అందించడంలో నిర్లక్ష్యం, ఇతర అత్యవరస పరిస్థితులపై వివాదాలు తలెత్తుతున్నాయి. మరికొన్నిచోట్ల రోగులకు సరైన వసతులు కల్పించడం లేదు. నాణ్యమైన భోజనం, వైద్య సేవలు అందించడం లేదు. ఈ పరిస్థితులపై తరచూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని అన్ని కొవిడ్ ఆసుపత్రుల్లోని పరిస్థితులపై 24 గంటలపాటు నిఘా ఉంచేలా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ నిర్ణయించారు. ఇందుకుగాను కొవిడ్ కంట్రోల్ రూమ్‌లో సీసీటీవీ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ఆసుపత్రుల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే సంబంధిత సమాచారాన్ని జిల్లా సీసీటీవీ డేటా అధికారి దృష్టికి వెంటనే చేరవేస్తున్నారు. తద్వారా సమస్యను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు 104, సీసీటీవీ నోడల్ అధికారి డాక్టర్ కె.అన్నపూర్ణ తెలిపారు.
మొదటిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో..