CBN Meeting : ఇన్ఛార్జ్లు లేని పెండింగ్ నియోజకవర్గాలపై దృష్టి సారించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ ప్రకాశం జిల్లా కందుకూరు నేతలతో సమావేశం కానున్నారు. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు ఈసారి అనారోగ్య కారణాలతో పోటీకి ఆసక్తిగా లేకపోవటం, మరోనేత దివి శివరాం అదే బాటలో ఉండటంతో కొత్త అభ్యర్థి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు. ఇన్ఛార్జ్ పదవిని ఇంటూరి నాగేశ్వరరావు, కంచర్ల శ్రీకాంత్, ఇంటూరి రాజేష్ తదితరులు ఆశిస్తున్నారు. నేటి సమావేశంలో ఇన్ఛార్జ్ ఎవరనేదాని పై అధినేత ఓ నిర్ణయానికి రానున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులకు 3రోజులపాటు శిక్షణ తరగతుల్ని నేడు చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ప్రారంభించనున్నారు.
CBN Meeting : నేడు కందుకూరు తెదేపా నేతలతో చంద్రబాబు సమావేశం - CBN Meeting with Kandukuru TDP leaders
జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు తెదేపా అధినేత చంద్రబాబు. ఇన్ఛార్జ్లు లేని పెండింగ్ నియోజకవర్గాలపై దృష్టి సారించిన ఆయన ఇవాళ ప్రకాశం జిల్లా కందుకూరు నేతలతో సమావేశం కానున్నారు.
చంద్రబాబు