Causeway Bridge collapses: ప్రకాశం జిల్లా దొనకొండ మండలం చందవరం గ్రామం వద్ద సాగర్ కాలువపై 1976లో నిర్మించిన కాజ్నే బ్రిడ్జి శనివారం రాత్రి కూలిపోయింది. ఈ బ్రిడ్జిపై నుంచి చందవరం, దేశిరెడ్డిపల్లె గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర తిరిగి రావాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. కూలిపోయిన పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జిని త్వరగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
Causeway Bridge Collapses: కూలిన కాజ్వే బ్రిడ్జి..ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
Causeway Bridge collapses: ప్రకాశం జిల్లాలో సాగర్ కాలువపై 1976లో నిర్మించిన కాజ్వే బ్రిడ్జి కూలిపోయింది. దీంతో రెండు గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొత్త బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్నారు.
కూలిన కాజ్వే బ్రిడ్జి