వారందరు రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు... అటువంటి వారికి లాక్డౌన్ శాపంగా మారింది. సుమారు 50 రోజులుగా పనుల్లేక అల్లాడుతున్నారు. చేతిలో ఉన్న కొద్ది మెుత్తం ఖర్చవడంతో తినటానికి తిండిలేక అల్లాడుతున్నారు. వారే ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన జీడిబట్టి కార్మికులు.
జీడి బట్టీ కార్మికుల లాక్డౌన్ కష్టాలు - జీడిబట్టీ కార్మికుల లాక్డౌన్ కష్టాలు
లాక్డౌన్ కారణంగా జీడిబట్టీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజు కూలీ మీద బతికే కార్మికులకు 50 రోజులుగా పనుల్లేక పోవటంతో కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడుతున్నారు. పనులు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ కార్మికులు వేడుకుంటున్నారు.
జీడిపప్పు పరిశ్రమలో జీడి గింజలను కాల్చి పప్పును తీయటం వీరి వృత్తి. గ్రామంలో ఎక్కువ శాతం ప్రజలు ఈ పని మీద ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. అటువంటిది గత 50 రోజుల నుంచి లాక్డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడటంతో పనుల్లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, దాతలు చేస్తున్న సాయంతో వారం, పది రోజుల కంటే కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. షరతులతో కూడిన అనుమతులతో పని కల్పించి తమను ఆదుకోవాలి వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:వస్త్ర వ్యాపారులతో తహసీల్దార్ సమావేశం