ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివిధ కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు ఆత్మహత్య - latest updates in guntur

మనోవేదన ఎంతటి మనిషినైనా.. దెబ్బతీస్తుంది. అది ఒక్కోసారి బలవన్మరణానికి ప్రేరేపిస్తుంది. నచ్చిన మనిషి దూరం అయ్యాడని..కొడుకు కనిపించటం లేదని ఇలా విభిన్న కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కొడుకు వియోగం ఆ తండ్రిని కలిచివేసింది. ఓ వైపు మనస్పర్ధలతో దూరం అయిన భార్య మరోవైపు నాలుగేళ్ల తన చిన్నారి కనిపించక పోవటంతో తల్లడిల్లిపోయాడు. తన వారే దూరం అయ్యాక ఇక బతకటం ఎందుకనుకున్నాడో ఏమో...కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడాడు.

suicide Cases
ఆత్మహత్య

By

Published : Oct 16, 2020, 9:18 AM IST

Updated : Oct 16, 2020, 11:14 AM IST

మానసిక ఆందోళన మనిషిని మరణానికి కూడా చేరువయ్యేలా చేస్తుంది. అయిన వారి దూరాన్ని భరించలేక కొందరు...ఆర్ధిక ఇబ్బందులతో మరికొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా రాష్ట్రంలో ఇలాంటి విభిన్న కారణాలతో బలవన్మరణాలు చోటుచేసుకున్నాయి.

అప్పుల బాధలు తాళలేక....

గుంటూరు జిల్లా తాడికొండ మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండేళ్లుగా అప్పులు పెరుగుతుండటంతో వాటిని తీర్చలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పటికి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

కుమారుడు కనిపించక పోవటంతో....

తప్పిపోయి తనకుమారుడు కనపడక పోవటంతో మనస్తాపంతో ఓ వ్యక్తి కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరూపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సయ్యద్ యాకూబ్ సాహెబ్, అమిషా దంపతులు మనస్పర్ధలతో విడిగా ఉంటున్నారు. ఈక్రమంలో కుమారుడు సయ్యద్ యూసఫ్ కనపడకపోవటంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు. ఆటోలలో ప్రచారం ద్వారా నెల రోజుల నుంచి వెతుకుతున్న కనిపించక పోవటంతో... తీవ్రమనోవేదనకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన యాకూబ్​ సాహెబ్ ఈపూరుపాలెం కాలువలో శవమై కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమించినవాడు కులం పేరుతో కాదనాడని...

ప్రేమించాను..పెళ్లి చేసుకుంటాను అని నమ్మించాడు. రెండేళ్లపాటు చెట్టాపట్టాలేసు తిరిగారు. పెళ్లి చేసుకోమనగానే కులాలు వేరు కుదరదు పొమన్నాడు. దీంతో మనస్థాపానికి గురైన యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కడప జిల్లా దువ్వూరుకు చెందిన యువతి హైదరాబాదులో బిటెక్ చదువుతోంది. అక్కడ జియాగూడకు చెందిన కరుణాకర్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి పెంచింది. దీంతో కులం పేరుతో దూషించి కాదు పోమ్మన్నాడు. మనస్థాపం చెందిన యువతి తన స్వగ్రామానికి వచ్చి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరుణాకర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

ఒంటరి జీవితంపై విరక్తితో...

కర్నూలు జిల్లా నంద్యాలలో నూనెపల్లెకు చెందిన రేవతి అనే మహిళ స్థానిక జీవ నియంత్రణ ప్రయోగశాల అవరణలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.ఆరేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి కలగడంతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సి. ఐ. మోహన్ రెడ్డి తెలిపారు.

అనారోగ్య కారణాలతో..

తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగేశ్వర్ నగర్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ డ్రైవర్​గా విధులు నిర్వహిస్తున్న గిరీంద్రబాబుగా పోలీసులు గుర్తిoచారు. అనారోగ్య కారణంగానే ఇంటిలో ఎవరు లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడినట్లు తిరుచానూరు ఎస్. ఐ .దీపిక వెల్లడిoచారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలిం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండీ...తిరుమల బ్రహ్మోత్సవాలు: నేడు బంగారు తిరుచ్చి ఉత్సవం

Last Updated : Oct 16, 2020, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details