ప్రకాశం జిల్లా చీరాల సీఐ రాజమోహన్పై కేసు నమోదైంది. వైకాపా సోషల్ మీడియా ప్రతినిధి యాతం క్రాంతి ఆయనపై ఇటీవల ఫిర్యాదు చేశారు. దాన్ని పరిశీలించిన స్థానిక కోర్టు కేసు నమోదుకు అనుమతినిచ్చింది.
అసలేం జరిగింది?

సీఎం జగన్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 5 వతేదీన చీరాలలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఆమంచి వర్గీయులు విద్యుత్ దీపాలు ఏర్పాటుచేస్తున్నారు. ఆసమయంలో అక్కడ 144 సెక్షన్, పోలీస్ 30 యాక్టు అమలులో ఉంది. విషయం తెలుసుకున్న సీఐ రాజమోహన్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. గుంపులుగా ఉండకూడదని వారితో వైకాపా నేతలకు చెప్పారు. దాంతో పోలీసులకు, వైకాపా సోషల్ మీడియా ప్రతినిధికి మధ్య వాగ్వివాదం జరిగింది. క్రాంతిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. విధులకు ఆటంకం కలిగించినందుకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. సీఐ రాజమోహన్ తనపై అన్యాయంగా దాడి చేశాడని అవుట్ పోస్టు పోలీసులకు క్రాంతి ఫిర్యాదు చేశారు. దానిపై కోర్టు అనుమతి అనంతరం ఎస్సై నాగశ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: