ప్రకాశం జిల్లా చీరాల వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసిన తర్వాత నియోజకవర్గంలోని వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో వైసీపీ కార్యకర్తల బూత్ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సమావేశానికి అనుమతి లేదని తెలిపారు. దీంతో ఆమంచి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తనపై అనవసరంగా కేసు పెట్టారని ఈసీకి ఫిర్యాదు చేస్తానని ఆమంచి అసహనం వ్యక్తం చేశారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. ఆమంచిపై కేసు నమోదు - prakasham
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ప్రకాశం జిల్లా చీరాల వైకాపా అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అనవసరంగా కేసు పెట్టారని ఈసీకి ఫిర్యాదు చేస్తానని ఆమంచి వ్యాఖ్యానించారు.
పోలీసులతో ఆమంచి వాగ్వాదం