ప్రకాశం జిల్లాలోని మార్టూరు వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. వారు తిరుమల నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పోలీసులు, హైవే సిబ్బంది ఇక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని సమీప ఆసుపత్రికి తరలించారు.
మార్టూరు వద్ద ఘోర ప్రమాదం.. నలుగురు మృతి - మార్టూరు జాతీయరహదారిపై రోడ్డుప్రమాదం నలుగురు మృతి.
ప్రకాశం జిల్లా మార్టూరు వద్ద జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

లారీని ఢీ కొన్న కారు
TAGGED:
లారీని ఢీ కొన్న కారు