అద్దంకి గుండ్లకమ్మ సమీపంలో కారు దగ్ధం - fire accident in addanki
ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ నది సమీపంలో ఓ కారు దగ్ధమైంది. సాంకేతిక కారణాలతో కారులో మంటలు చెలరేగాయి. అది గమనించిన డ్రైవర్ అప్రమత్తం కావటంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గుండ్లకమ్మ సమీపంలో సాంకేతిక కారణాలతో ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. కారులో భారీగా మంటలు చెలరేగడం.. పెద్దపెద్ద శబ్దాలు రావటంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనతో గంటకుపైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కబెట్టారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. కారు అద్దంకి నుంచి ముండ్లమూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు.