ప్రకాశం జిల్లా దర్శిలో కురిచేడు రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాకతీయ నగర్ వద్ద కారు- బైకు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కురిచేడు నుంచి వస్తున్న కారు, దర్శి నుంచి శివనగర్ వైపు వెళ్తున్న బైకును ఢీ కొట్టింది. ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు పోరుమామిళ్ళ పెద వేంకటేశ్వర్లు మృతి చెందాడు. రెండో వ్యక్తి పోరుమామిళ్ళ చెన్నయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో నరసరావుపేటలో ఆస్పత్రికి తరలించారు.
బైకు, కారు ఢీ.. వ్యక్తి మృతి - darsi
ప్రకాశం జిల్లా దర్శిలో కురిచేడు రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు- బైకు ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
యాక్సిడెంట్