గంజాయి అమ్ముతున్న నలుగురిని ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 14 కిలోల గంజాయి, 56 సీసాలలో ఉన్న గంజాయి ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
14 కిలోల గంజాయి పట్టివేత... నలుగురు అరెస్టు - prakasam jillalo ganjai pattivetha
ప్రకాశం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
![14 కిలోల గంజాయి పట్టివేత... నలుగురు అరెస్టు cannabis seized in prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11196857-254-11196857-1616963689835.jpg)
విశాఖపట్నం జిల్లా అరకువ్యాలీకి చెందిన బురిడీ సత్తిబాబు, సిందేరి నర్సులు పొలంలో గంజాయి సాగుచేస్తూ... అరకు వచ్చే టూరిస్టులకు, గంజాయి అక్రమవ్యాపారులకు కిలో రూ.3 వేలకు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. సీతమ్మపేటకు చెందిన రాయుడు నరసింహమూర్తికి చెందిన బొలెరో వాహనంలో సరుకు రవాణా చేసేవారని వివరించారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన తన్నీరు నాగరాజుతో పరిచయం ఏర్పడి.. టమోటాల లోడు వేసుకుని వాటి మధ్యలో గంజాయి పొట్లాలు, 56 గంజాయి ఆయిల్ సీసాలను తీసుకొని వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు రాజుపాలెం చెక్ పోస్టు వద్ద నిందితులను పట్టుకున్నారు.
ఇదీ చదవండి