ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మూడోదశ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం వాడివేడిగా సాగుతుంది. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు. వారికి కేటాయించిన గుర్తులతో వినూత్న రీతిలో ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కనిగిరి మండలం తుమ్మగుంట గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి ఇండ్ల రత్తమ్మకు మంచం గుర్తును కేటాయించగా...ఆమె వినూత్న రీతిలో రెండు పొట్టేళ్లపై మంచాన్ని ఏర్పాటు చేసి ఇంటింటికి తిరుగుతూ...తనకు ఓటు వేయాలని కోరుతున్నారు.
వినూత్న రీతిలో ప్రచారం... ఓటర్లను ఆకట్టుకునే వ్యూహం - ప్రకాశం జిల్లా ముఖ్యాంశాలు
ప్రకాశం జిల్లాలో మూడో విడత ఎన్నికలకు ప్రచారం జోరుగా కొనసాగుతోంది. అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను వినూత్న రీతిలో ప్రదర్శిస్తూ ఓట్లర్లను ఆకట్టుకుంటున్నారు.
పోట్టెలపై మంచం పెట్టుకోని ప్రచారం చేస్తున్న సర్పంచ్ అభ్యర్థిని