Kanigiri Bus Stand: ప్రకాశం జిల్లా కనిగిరి ప్రజలు ఆర్టీసీ బస్టాండ్‌లోకి అడుగుపెట్టాలంటేనే భయపడుతున్నారు. బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంది. పైకప్పు ఇనుప చువ్వలు బయటపడటంతో ఎప్పుడు ఎవరి మీద పెచ్చులు పడతాయోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గోడలు పగిలి, స్లాబు నుంచి వాన నీళ్లు కారుతున్నాయి. ఆర్టీసీ సిబ్బంది సైతం భయంతోనే విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే బస్టాండ్‌కు వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
భయం గుప్పిట్లో బస్టాండ్‌లోని ప్రయాణికులు.. - ప్రకాశం జిల్లా
Kanigiri Bus Stand: ఇటీవల గుత్తి బస్టాండ్‌లో పైకప్పు పెచ్చులు ఊడిపడి ప్రమాదం జరిగింది. అలాగే, స్లాబ్ పెచ్చులు ఊడిపడి ఎవరిమీద పడతాయోననే భయం గుప్పిట్లో మగ్గుతున్నారు.. కనిగిరి బస్టాండ్ కు వచ్చే ప్రయాణికులు. ఏ మూలకు వెళితే, ఏమౌనో..అన్న సందేహాల నడుమ బస్సుల కోసం తప్పడం లేదని వాపోతున్నారు.
కనిగిరి ఆర్టీసీ బస్టాండ్
ఇటీవల జరిగిన గుత్తి ఆర్టీసీ బస్టాండ్ ప్రమాదం వంటి ఘటన జరిగే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. బస్టాండ్‌లోకి రావాలంటే భయంగా ఉందని.. ఎక్కడ పెచ్చులు మీద పడతాయో అనే భయం ఉందని ప్రయాణికులు అంటున్నారు. అధికారులు స్పందించి ప్రమాదం జరగకముందే మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: