ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సు-కారు ఢీ... ఒకరు మృతి

చీరాలలో కారును ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో చీరాల ఆర్టీసీ డిపో కండక్టర్ శ్రీనివాసరావు అక్కడిక్కడే మృతి చెందాడు.

కారును ఢీకొన్న ప్రైవేట్ బస్సు... ఒకరు మృతి
కారును ఢీకొన్న ప్రైవేట్ బస్సు... ఒకరు మృతి

By

Published : May 17, 2020, 5:03 PM IST

ప్రకాశం జిల్లా వేటపాలెం న్యూబైపాస్​ రోడ్డుపై ప్రైవేట్ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో చీరాల ఆర్టీసీ డిపో కండక్టర్​ పల్లపోలు శ్రీనివాసరావు మృతిచెందారు. ఈయన చీరాల నుంచి చిన్నగంజాంకు కారులో వెళ్తుండగా ఆ వాహనాన్ని ఒంగోలు నుంచి రేపల్లే వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. గాయపడిన బస్సు డ్రైవర్​ను చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details