ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాల బస్సు బోల్తా.. పది మందికి తీవ్రగాయాలు - పొట్లపాడులో బస్సు బోల్తా

ప్రకాశం జిల్లా పొట్లపాడులో పాఠశాల బస్సు బోల్తా పడి.. పది మందికి తీవ్రగాయాలయ్యాయి. ఉపాధ్యాయులు, వారి కుటుంబసభ్యులు విహారయాత్రకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆటోను తప్పించబోతుండగా ఈ ప్రమాదం జరిగింది.

bus accident
bus accident

By

Published : Feb 8, 2020, 1:02 PM IST

పాఠశాల బస్సు బోల్తా, పది మందికి తీవ్రగాయాలు

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పొట్లపాడు వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయులు... తమ కుటుంబసభ్యులతో ప్రకాశం జిల్లా భైరవకోనకు విహారయాత్రకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి బస్సును అదుపు చేయలేక ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బోల్తాపడ్డ అనంతరం 40 మీటర్లు వరకూ బస్సు ఈడ్చుకుంటూ వెళ్లటంతో ఒకవైపున కూర్చున్న 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details