ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోయినవారిపాలెంలో సందడిగా ఎడ్ల బండ్ల పందేలు - చీరాల ఎడ్ల పందేల వార్తలు

నూతన సంవత్సరం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో ఎడ్ల బండ్ల పందేలు నిర్వహించారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 28 జతల ఒంగోలు జాతి ఎడ్లు పోటీ పడ్డాయి.

bull race
27 ఏళ్లుగా నిర్వహణ... 28 జతల ఒంగోలు జాతి ఎడ్ల పోటీ

By

Published : Jan 2, 2021, 6:36 AM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో... నూతన సంవత్సరం సందర్భంగా పోలురాధా పేరుతో ఎడ్ల బండ్ల పందేలు నిర్వహించారు. శ్రీ కృష్ణా యాదయ్ యూత్ ఆధ్వర్యంలొ జరిగిన పోటీల్లో ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన 28 జతలు ఒంగోలు జాతి ఎడ్ల జతలు పోటీపడ్డాయి.

ఈ కార్యక్రమాన్ని 27 ఏళ్లుగా కొత్త సంవత్సరం రోజున ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. పోటీలను వైకాపా యువ నాయకుడు కరణం వెంకటేష్ ప్రారంబించారు. ఒంగోలు జాతి ఎడ్లను పరిరక్షించేందుకు, రైతులను ప్రొత్సహించేందుకు... పశుబల ప్రదర్శనలు ఏర్పాటుచేయటం సంతోషదాయకమని వెంకటేష్ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details