ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పుట్టచెరువుపాలేనికి చెందిన ఎస్.వేణు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. స్థానికంగా పొలం పనులు చేసుకుంటూ... చిట్టీలు నిర్వహించేవాడు. ఈ క్రమంలో జరుగుమల్లి మండలం పమిడిపాడుకు చెందిన యువతితో ఈ నెల 24 న వివాహం జరిగింది. ఎంతో ఆనందంగా గడపాల్సిన నవదంపతులకు ఏమైందో తెలీదు వరుడు తాళ్ళూరు మండలం సూరాయపాలెంలోని సుబాబుల్ తోటలో పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని సోదరుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నవ వరుడి మరణంతో పుట్టచెరువు పాలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పెళ్లైన నాలుగురోజులకే యువకుడు ఆత్మహత్య - నవ వరుడు ఆత్మహత్య
ఆ దంపతులకు వివాహమై నాలుగు రోజులే అయింది. కొండంత ఆశతో...నవ వధువు అత్తారింట్లోకి అడుగు పెట్టింది. వైవాహిక జీవితంపై నవ దంపతులు ఎన్నో కలలుగన్నారు. ఇంతలో ఏమైందో...ఆ నవవరుడు పురుగులు మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం సూరాయ పాలెంలో జరిగింది.
పెళ్లైన నాలుగురోజులకై నవ వరుడు ఆత్మహత్య !
Last Updated : Jul 28, 2020, 2:32 PM IST