ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కురిచేడులో దారుణం.. బాలికపై బాలుడి లైంగిక దాడి - boy sexual assault girl in kurichedu news

పశువులను మేపేందుకు వెళ్లిన బాలికపై బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో జరిగింది.

boy sexual assault
boy sexual assault

By

Published : Apr 25, 2021, 9:35 AM IST

పశువులను మేపేందుకు వెళ్లిన బాలికపై బాలుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో జరిగింది. కురిచేడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ప్రతిరోజు గ్రామ సమీపంలో పొలాల్లో పశువులను మేపుతోంది. అదే గ్రామానికి చెందిన ఓ బాలుడు కూడా పశువులను మేపేందుకు బాలికతో కలసి వెళుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బాలికపై బాలుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.

బాలిక ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు వైద్య చికిత్స నిమిత్తం వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడినుంచి దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలోని వైద్యురాలు బాలికను పరీక్షించిన అనంతరం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ మైనర్లు కావటంతో గ్రామ పెద్దలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:కరోనా సోకి ఈనాడు సీనియర్‌ ఉప సంపాదకుడి మృతి

ABOUT THE AUTHOR

...view details