ప్రకాశం జిల్లా దర్శి మండలం తానంచింతల గ్రామానికి చెందిన మెట్టెల నాగయ్య కుమారుడు వీరబ్రహ్మకు 15 ఏళ్లు. పుట్టు మూగ ,చెవుడు. అతడు.. తన తోటి స్నేహితులతో కలసి నాగార్జున సాగర్ ప్రధాన కాలువలో ఈత కొట్టడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు వీరబ్రహ్మ ఒక్కసారిగా గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు కేకలు వేయగా.. స్థానికులు ఘటనా స్థాలానికి చేరుకొని వెతుకులాట ప్రారంభించారు. ఇప్పటి వరకు అతని జాడ తెలియలేదు. సాగర్ కాలువ వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కుమారుని రాక కోసం ఎదురు చూస్తున్నారు. నాగయ్యకు ఒక్కగానొక్క కుమారుడు. కాలువలో పడి గల్లంతవటంతో తానంచింతల గ్రామంలో విషాదం నెలకొంది.
ఈత సరదా: సాగర్ కాలువలో గల్లంతైన బాలుడు
స్నేహితులతో సరదాగా ఈత కొట్టాలనిపించింది ఆ బాలుడికి. శారీరక వైకల్యం ఉన్నా.. సరదాగా స్నేహితులతో కలిసి సాగర్ కాలువలో ఈతకు వెళ్లాడు. నీటి ప్రవాహానికి అదుపు తప్పిన ఆ బాలుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పోతవరం వద్ద ఉన్న సాగర్ ప్రధాన కాలువలో జరిగింది.
boy died in darsi