రోడ్డు దాటుతుండగా లారీ ఢీ కొని బాలుడు మృతి చెందిన ఘటన... ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలం వెల్లంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన యశ్వంత్.... రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో యశ్వంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలంలోనే లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.
వెల్లంపల్లిలో రోడ్డు ప్రమాదం... లారీ ఢీ కొని బాలుడు మృతి
ప్రకాశం జిల్లా వెల్లంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బాలుడు రోడ్డు దాటుతుండగా... వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ...రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.
వెల్లంపల్లిలో లారీ ఢీ కొని బాలుడు మృతి
ఈ ప్రమాదంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై వేగ నియంత్రికలు ఏర్పాటుచేయాలంటూ ఆందోళన చేశారు. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీచదవండి.