ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

3 రాజధానులపై కేంద్రం పాత్ర పరిమితం: పురందేశ్వరి - పురందేశ్వరికి భాజపాలో కొత్త పదవి వార్తలు

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్రం పాత్ర చాలా పరిమితమైనదని భాజపా నాయకురాలు పురందేశ్వరి అన్నారు. తనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

Daggubati Purandhareswari
DaggDaggubati Purandhareswariubati Purandhareswari

By

Published : Sep 27, 2020, 11:52 AM IST

Updated : Sep 27, 2020, 12:34 PM IST

3 రాజధానులపై కేంద్రం పాత్ర పరిమితం: పురందేశ్వరి

భాజపాను బలోపేతం చేయడమే లక్ష్యమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ప్రకాశం జిల్లా కారంచేడులో మీడియాతో మాట్లాడిన ఆమె... ప్రజాసమస్యలపై పోరాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో భాజపాను అధికారంలోకి తీసుకువచ్చే దిశగా పని చేస్తామన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పలు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ... అగ్రనాయకత్వం సలహాల మేరకు పార్టీని ప్రజ్లలోకి తీసుకెళ్తామన్నారు.

ఏపీలో మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర పరిమితమైనదని చెప్పారు. వ్యవసాయ బిల్లుతో ఎలాంటి నష్టం ఉండదని... రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. తనపై నమ్మకం ఉంచి కొత్త బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Last Updated : Sep 27, 2020, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details