BJP Dharna on Ration danda: తమపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. బిల్లులు లేకుండా బియ్యం తరలిస్తున్న లారీని ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చిన తమపైనే కేసులు పెట్టడం ఏంటని భాజపా నాయకులు ప్రశ్నించారు. మార్కాపురం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నా.. పోలీసులు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ అక్రమ రేషన్ బియ్యం అడ్డుకునే ప్రయత్నం చేసిన తమపై కేసులు నమోదు చేశారన్నారు. ఈ కేసులను నిరసిస్తూ వారం రోజులుగా పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్సై సుబ్బరాజుపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. అక్రమ రేషన్ దందాపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని కోరారు.
రేషన్ దందాపై భాజపా ధర్నా.. అక్రమ కేసులు ఎత్తివేయలంటూ నిరసన - మార్కాపురంలో భాజపా ధర్నా
BJP Dharna on Ration danda: తమపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట భాజపా నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నా.. పట్టించుకోని పోలీసులు, అధికారులు అడ్డుకునేందుకు యత్నించిన తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
రేషన్ దందాపై భాజపా ధర్నా