ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న టిప్పర్-ఒకరు మృతి - accident
ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడు ప్రకాశం జిల్లా చీరాలలో చల్లారెడ్డిపాలెం వద్ద కొణిజేటిచేనేతపురి కాలనీకి చెందిన జొన్నాదుల సత్యన్నారాయణగా గుర్తించారు.
ప్రకాశం జిల్లా చీరాల-వేటపాలెం జాతీయరహదారిపై ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు.జాతీయరహదారిలో చల్లారెడ్డిపాలెం వద్ద కొణిజేటిచేనేతపురి కాలనీకి చెందిన జొన్నాదుల సత్యన్నారాయణ చీరాలకు ద్విచక్రవాహనం పై వెళుతుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది...ప్రమాదంలో జొన్నాదుల సత్యన్నారాయణ(30)అక్కడికక్కడే మృతిచెందాడు.విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదుచేసుకుని మృతదేహాన్ని చీరాల ప్రభుత్వఆసుపత్రి కి తరలించారు.