కేంద్రంలో మోదీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ... వామపక్షాలు పిలుపునిచ్చిన 'భారత్ బంద్' ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఒంగోలులోని ఆర్టీసీ డిపో ఎదుట వామపక్ష పార్టీల నేతలు ఆందోళన చేశారు. బస్సులను అడ్డుకున్నారు. నోట్లు రద్దు, కార్మిక చట్టాల సవరణ, ప్రైవేటీకరణ పేరుతో ఉద్యోగుల తొలగింపు వంటి నిర్ణయాలను నిరసిస్తూ కళాకారులు ప్రదర్శనలు చేశారు. యర్రగొండపాలెం, చీరాల నియోజకవర్గాల్లో సార్వత్రిక్ బంద్ సాగింది. అద్దంకిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ముస్లింలు రాస్తారోకో చేపట్టారు. 60 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు.
ప్రకాశంలో ప్రశాంతంగా సాగిన 'భారత్ బంద్ - ప్రకాశం జిల్లాలో భారత్ బంద్
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వామపక్షలు తలపెట్టిన సార్వత్రిక సమ్మె ప్రకాశం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది.
ప్రకాశం జిల్లాలో జరిగిన భారత్ బంద్