ఒంగోలు బస్టాండ్ వద్ద వామపక్షాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్టీసి బస్సు సేవలను నిలిపివేసి.. ప్రైవేట్ బస్సులను, ఆటోలు తిరగకుండా అడ్డుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి.. కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారన్నారు.
పర్చూరు నియోజకవర్గాల్లో బంద్..
పర్చూరు నియోజకవర్గాల్లో బంద్ సందర్భంగా.. విద్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. చీరాల మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్లోని దుకాణాలన్ని మూతపడ్డాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నన్నారు. మోదీ.. ప్రభుత్వ రంగ సంస్థలను, బ్యాంక్ లను కూడా ప్రైవేటు పరం చేయాలనే ప్రయత్నాలను తిప్పికొడదాం అని పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ, సీ.ఐ.టీ.యు, సమాజ్ వాదీ పార్టీలు, వివిధ వామపక్ష, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి.
యర్రగొండపాలెంలో..
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. యర్రగొండపాలెంలో సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పట్టణంలో తెరచిన దుకాణాలను మూసివేయించి.. భారత్ బంద్కు అందరూ సహకరించాలని కోరారు. పుర విధులలో తిరుగుతూ విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించు కోవాలని నినాదాలు చేశారు.
కనిగిరిలో భారత్ బంద్..