ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుష్మా స్వరాజ్ జీవితం.. ఎందరికో ఆదర్శం - సునీల్ దేవధర్

సుష్మా స్వరాజ్ జీవితం.. ఎంతోమందికి ఆదర్శమని భాజపా  జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాలలో సంఘటన పర్వ్ 2019లో భాగంగా భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

భాజపా సభ్యత్వ నమోదు సమీక్షా సమవేశం

By

Published : Aug 8, 2019, 7:56 PM IST

భాజపా సభ్యత్వ నమోదు సమీక్షా సమవేశం

సుష్మా స్వరాజ్ మృతి దేశానికి తీరని లోటని భాజపా జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తెలుగు రాష్టాల్లో పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రధాని మోదీ కాశ్మీర్​పై చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. 370 రద్దుకు రాజ్యసభలో మద్దతు ఇచ్చిన తెదేపా, వైకాపాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details