ప్రకాశం జిల్లాలో శెనగ పంట సాగు చేసిన రైతులు... ఈసారి నిండా మునిగారు. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి , దర్శి , పర్చూరు, అద్దంకి, కందుకూరు, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల్లో రబీ కింద 90 వేల హెక్టార్లలో శెనగ పంట వేశారు. సాధారణంగా నవంబర్ నెల ఆరంభంలో శెనగను సాగు చేస్తారు. ఈ సీజన్లో వర్షాలు కురిసి... వాతావరణం అనుకూలించలేదు. ఫలితంగా నెల ఆలస్యంగా పంటలు వేశారు. కానీ వాటికి తెగుళ్లు సోకి ఎండిపోతున్నాయి.
ఇదీ చదవండి :TEN ANDHRA NAVAL UNIT NCC: అక్కడి కఠోర శిక్షణ...బంగారు భవితకు నిచ్చెన
Bengalgram Crop in Prakasham :శెనగ మొక్క ఎదుగుతున్న దశలో ఎండు తెగులు సోకి పూర్తిగా పంట ఎండిపోతోంది. సస్యరక్షణ చేపట్టినా తెగుళ్లు తగ్గలేదు. చేసేది లేక.. పర్చూరు, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, ఉప్పుగుండూరులో చాలామంది రైతులు శెనగ పంటను తొలగించారు. దాని స్థానంలో మినుము, జొన్న, పెసర పంటలు వేసుకుంటున్నారు.
" గత పదేళ్ల నుంచి శెనగ సాగు చేస్తున్నాం. గత ఏడాది అధిక వర్షాలకు దెబ్బ తిన్న మిర్చి పంటను పీకివేసి మరీ శెనగ పంటను వేశాం. అయినా కానీ భూమిలో ఫంగస్ ఉండటం కారణంగా కళ్లాలు కళ్లాలుగా ఎకరంలో 60శాతం మేర శెనగ పంట ఎండిపోతుంది. " -వెంకట్రావు, రైతు, నాగులుప్పలపాడు