Beer Lorry Rolled Over : ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బీరు లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లెకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్న బీరు బాటిళ్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ సమాచారం తెలియడంతో అక్కడికి భారీగా జనం చేరుకున్నారు. బీరు సీసాల కోసం మందుబాబులు ఎగబడ్డారు. ఎవరికి దొరికిన సీసాలు వారు పట్టుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు.
బీరు లోడు లారీ బోల్తా... ఎగబడ్డ మందుబాబులు - Beer Lorry Rolled Over in Mulaguntapadu
Beer Lorry Rolled Over: అసలే సమ్మర్.. ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో రోడ్డుపై బీరు లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ సమాచారం ఆ ప్రాంతమంతా తెలిసింది. అంతే.. జనమంతా ప్రమాద స్థలానికి పరుగులు తీశారు. తమకు బీరు సీసాలు దొరుకుతాయేమోనని ఎగబడ్డారు. ఎవరికి దొరికినవి వారు సంకలో పెట్టుకుని అక్కడినుంచి జారుకున్నారు.
Beer Lorry Rolled Over