మంత్రి శంకర్నారాయణ విద్యార్థులకు పాఠాలు బోధించారు. వేటపాలెం బీసీ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. ముందుగా విద్యార్థుల తరగతి గదికి వెళ్లిన మంత్రి... పాఠ్యపుస్తకం తీసుకొని విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. తెలుగులో సంధులు, సమాసాల గురించి విద్యార్థులకు బోధించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడిగా మారిన మంత్రి శంకర్నారాయణ
బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్నారాయణ ఉపాధ్యాయుడయ్యారు. ప్రకాశం జిల్లా వేటపాలెం బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించారు.
bc welfar minister visit in vetapalem residencial scool
మాతృభాష తెలుగైనప్పటికీ... ఆంగ్లంలో పట్టుసాధించాలని విద్యార్థులకు సూచించారు. వచ్చేఏడాది ఒకటి నుంచి ఐదు తరగతులకు ఆంగ్లం బోధించేందుకు ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. ప్రతీ పేద విద్యార్థి చదువుకునేందుకు అమ్మఒడి పథకం ప్రవేశపెట్టారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసు కాదు... బ్యాక్ బోన్ క్లాస్'