ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రాబ్యాంకు మేనేజర్ భార్య ఆత్మహత్య - recent suicide in kanigiri

కుటుంబ కలహాలతో బ్యాంకు మేనేజర్ భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

bank manager wife suicide
ఆంధ్రాబ్యాంకు మేనేజర్ భార్య ఆత్మహత్య

By

Published : Sep 4, 2020, 8:21 AM IST

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం సుభాష్ రోడ్డులో కనిగిరి ఆంధ్రాబ్యాంకు మేనేజర్ భార్య అనుమానాస్పద రీతిలో గురువారం సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రాబ్యాంకు మేనేజర్ సిరిగిరి లింగారావు భార్య భ్రమరాంబిక.. భర్త బ్యాంకుకు వెళ్లిన సమయంలో సాయంత్రం ఇంట్లో ఫ్యానుకి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన లింగారావు.. తలుపు కొట్టగా ఎంతకీ తియ్యకపోవటంతో, అనుమానం వచ్చి తలపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. లోపల ఫ్యానుకు ఉరివేసుకొని వేలాడుతూ ఉన్న భ్రమరాంబిక కనిపించటంతో.. వెంటనే కిందకు దించి ప్రైవేటు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. మార్గమధ్యలోనే మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. వీరికి ఏడాదిన్నర వయస్సున్న బాలుడు ఉన్నాడనీ.. మృతురాలిది గుంటూరుని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందనీ.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details