ప్రకాశం జిల్లా ఒంగోలులో దక్షిణ భారత రాష్ట్రాల పాఠశాల విద్యార్థుల బ్యాండ్ పోటీలు నిర్వహించారు. మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ పోటీల్లో...దక్షిణాది రాష్ట్రాల నుంచి వివిధ పాఠశాల విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఇందులో గెలుపొందిన బృందం... జనవరి 26న జరగనున్న గణతంత్ర దినోత్సన పరేడ్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి బ్యాండ్ పోటీలను ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి బ్యాండ్ బృందాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. పిల్లలకు చదువుతో పాటు క్రీడలు చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఏడు రాష్ట్రాల నుంచి 13 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఒక్కో జట్టులో 25 మంది సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేకమైన వాయిద్యాలు, ఆకర్షణీయ వేషధారణతో ప్రతి విద్యార్థి బృందం ఆకట్టుకుంది. వీటిని తిలకించేందుకు నగరంలోని పాఠశాల విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఒంగోలులో అట్టహాసంగా బ్యాండ్ పోటీలు - band competitions at ongole in prakasam district
ఒంగోలులో దక్షిణ భారత రాష్ట్రాల పాఠశాల విద్యార్థులు బ్యాండ్ పోటీలు నిర్వహించారు. ఇందులో గెలిచిన వారికి జనవరి 26న జరగనున్న గణతంత్ర దినోత్సన పరేడ్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
అట్టహసంగా ఒంగోలులో బ్యాండ్ పోటీలు