గుంటూరు జిల్లా నూతక్కి నుంచి చీమకుర్తికి అరటికాయల లోడుతో వెళ్తున్న మినీలారీ మార్టూరు వద్ద ప్రమాదానికి గురయింది. ఒంగొలు జాతీయరహదారిపై వెళుతున్న లారీ వెనుక టైరు పంక్చర్ అయింది. రహదారిపై బోల్తాపడింది. అరటిగెలలు చెల్లాచెదురుగా పడ్డాయి. డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న మార్టూరు ఎస్.ఐ శివకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. జాతీయరహదారిపై పడ్డ అరటిగెలలను పక్కకుతీసి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు.
రహదారిపై అరటిపళ్ల లారీ బోల్తా - bananna lorry met accident in prakasam dt
టైర్ పంక్చర్ కావటంతో అరటిపళ్ల లారి బోల్తాపడింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్టూరులో జరిగింది.
banana lorry blotha in prakasam dst due to tire punher on highway
TAGGED:
corona cases in prakasam dst