ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Suspended: అవినీతి ఆరోపణలతో.. ఎస్సై, కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటు - బల్లికురవ ఎస్సై సస్పెండ్

సీజ్ చేసిన ఓ లారీని వదిలే క్రమంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో బల్లికురవ ఎస్సై, కానిస్టేబుల్‌ను ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ సస్పెండ్ చేశారు.

Ballikurava si ann Constable‌ Suspended
బల్లికురవ ఎస్సై, కానిస్టేబుల్‌ సస్పెండ్

By

Published : Aug 13, 2021, 7:32 PM IST

ప్రకాశం జిల్లా బల్లికురవ ఎస్సై, కానిస్టేబుల్‌.. అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. ఓ కేసులో సీజ్ చేసిన లారీని వదిలే సమయంలో అవినీతికి పాల్పడిననట్టు తేలినందున.. వారిని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ తెలిపారు.

సీజ్​ చేసిన గ్రానైట్ లారీని విడిపెట్టే క్రమంలో అందులో ఉన్న అసలు గ్రానైట్‌కు బదులుగా నాసిరకం గ్రానైట్‌ను ఉంచినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో ఎస్సై శివనాంచారయ్య, కానిస్టేబుల్ బాలాజీపై వేటు వేసినట్టు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details