ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం' - మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజా న్యూస్

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో విజేతలకు.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన నివాసంలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. 25 సర్పంచ్​ స్థానాలకు గానూ.. 22 చోట్ల తమ అనుచరులు విజయం సాధించారని మంత్రి పేర్కొన్నారు.

Balineni Srinivasareddy's victory rally with the victory of his party's candidates in the panchayat elections at Ongole in Prakasam district
'రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం'

By

Published : Feb 10, 2021, 6:19 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం పంచాయతీ ఎన్నికల్లో 25 సర్పంచ్​ స్థానాలకు గానూ.. 22 చోట్ల.. తమ అనుచరులే విజయం సాధించారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వారికి.. తన నివాసంలో విజయోత్సవ సభ నిర్వహించారు.

సీఎం జగన్.. రాష్ట్రంలో చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధిని చూసి.. ప్రజలు తమపై నమ్మకంతో ఓటు వేశారని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details