తాను వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్ వెళితే... వైరస్ ప్రభావానికి గురైనట్లు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఒంగోలులో లాక్‌డౌన్ అమలవుతున్న తీరును మంత్రి బాలినేని పరిశీలించారు. బాపూజీ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన సోడియం హైపో క్లోరైడ్ ద్రావణ ద్వారాన్ని మంత్రి ప్రారంభించారు. నిత్యావసరాల సరఫరా కార్యక్రమం అమలును పరిశీలించారు.
'ప్రతిపక్షాలు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి' - balineni fires on tdp
తనకు కరోనా వైరస్ సోకినట్లు ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి బాలినేని అన్నారు. అసత్య ప్రచారాలు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు
ప్రతిపక్షాలపై బాలినేని ఆగ్రహం