ఒంగోలులో బాలినేని అభిమానుల సంబరాలు - celbrations
మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి అభిమానులు ఒంగోలులో సంబరాలు చేశారు. జై జగన్, జై బాలినేని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో నూతన మంత్రిగా బాలినేని శ్రీనివాసులురెడ్డి ప్రమాణ స్వీకారం చేసినందున ప్రకాశం జిల్లా ఒంగోలులో వైకాపా కార్యకర్తలు సంబరాలు చేశారు. స్థానిక గాంధీ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద బాలినేని, జగన్‌కి అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాణసంచా కాల్చి.... అందరికి స్వీట్లు పంచి అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మరో ఐదేళ్లలో అద్భుతమైన పాలన అందించి... అభివృద్ది దిశగా రాష్ట్రాన్ని తీసుకువెళతారని వైకాపా నాయకులు ఆకాంక్షించారు.