రాష్ట్రంపై తెలంగాణ పెత్తనం అవసరమా? - ప్రకాశం జిల్లా
యువతకు ఉద్యోగాలు రావాలంటే తెదేపా తిరిగి అధికారంలోకి రావాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రా వాళ్లను వద్దన్న కేసీఆర్ వ్యాఖ్యలు గుర్తు చేసిన బాబు.. రాష్ట్రంపై తెలంగాణ పెత్తనం అవసరమా అని ప్రశ్నించారు.
దేశంలోని అన్ని రకాల కేసులూ జగన్‌పై ఉన్నాయన్న సీఎం..రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా అన్ని సమస్యలు పరిష్కరించామన్న సీఎం.. ప్రపంచంలోనే ఏపీని నెంబర్‌వన్ చేసేవరకు నిద్రపోనని తెలిపారు. జగన్‌తో లాలూచీపడి ఏపీని నాశనం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. ఆత్మగౌరవం దెబ్బతిస్తే సహించేది లేదని కేసీఆర్‌ను సీఎం హెచ్చరించారు. జగన్‌కు ఒకసారి అవకాశం ఇస్తే రాష్ట్రం నాశనమేనని చంద్రబాబు రాష్ట్ర ప్రజల్ని హెచ్చరించారు. ఆంధ్రా వాళ్లను వద్దన్న కేసీఆర్ వ్యాఖ్యలు గుర్తు చేసిన బాబు.. రాష్ట్రంపై తెలంగాణ పెత్తనం అవసరమా అని ప్రశ్నించారు. సైకిల్ గుర్తుకే ఓటు వేసి మరోసారి తెదేపానే గెలిపించాలని ఓటర్లను కోరారు.