పోలీస్ సిబ్బందికి ఆయుర్వేద మందుల పంపిణీ - Ayurvedic syrup distributed to Police
కరోనా నియంత్రణలో భాగంగా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి... కొత్తపేటలో నాడీ వైద్యుడు శశిధర్ మహా సుదర్శన కాడ అనే ఆయుర్వేదం టానిక్‌ను పంపిణీ చేశారు.
![పోలీస్ సిబ్బందికి ఆయుర్వేద మందుల పంపిణీ 'Ayurvedic lotion distributed to Police depertment at prakasham](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7779024-645-7779024-1593177912773.jpg)
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నాడీ వైద్యుడు శశిధర్.. పోలీస్ సిబ్బందికి...మహా సుదర్శన కాడ అబ్ టానిక్‌ను సీఐ ఎండీ ఫిరోజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. డాక్టర్ శశిధర్ కరోనా నియంత్రణలో భాగంగా ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు ఆయుష్ విభాగం ప్రతిపాదించిన మహా సుదర్శన కాడ అనే ఆయుర్వేదం టానిక్‌ను రాష్ట్ర పోలీస్ కార్యాలయానికి పంపించారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు..ఈ ఔషధాన్ని పంపిణీ చేయటం శుభ పరిణామమని...సీఐ ఎండీ ఫిరోజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో సనాతన ట్రస్ట్ సభ్యులు కిరణ్ కబీర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.