ప్రకాశం జిల్లా పుల్లలచేరువులో వైఎస్ఆర్ క్రాంతి పథకం ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఈ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్లొన్న వైద్యాధికారి గౌతమి.. కొవిడ్ 19 పటల్ తగు సలహాలు, సూచనలు చేశారు.
అనంతరం సచివాలయ, పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫర్ అసిస్టెంట్లు, ఏఎన్ఎమ్లతో వైరస్ పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. తగు సలహాలు, సూచనలు చేశారు. సిబ్బంది గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరికి వైరస్‌పై అవగాహన కల్పించి తగు జాగ్రత్తలు తీసుకొనేలా చర్యలు తీసుకోవాలన్నారు.