ప్రపంచ ఆరోగ్య సంస్థ ,పర్యావరణం ను దృష్టిలో ఉంచుకుని..పొగాకు రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించే ప్రయత్నాలను చేస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ఒంగోలులో వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, పొగాకు బోర్డు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాయి. పొగాకు విస్తీర్ణం తగ్గించడం, పంట ఖర్చులు తగ్గించుకోవడం వంటి చర్యలు ద్వారా ..పొగాకు పంటకు దూరంగా వెళ్లే మార్గాలను సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల కోసం అధిక దిగుబడి, లాభం వచ్చే నూతన వంగడాలు రైతుల దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో రానున్న సీజన్ లో ఏ ఏ పంటలు వేసుకోవాలి? పొగాకు ప్రత్యమ్నాయ పంటలు ఏమిటి అనే అంశంపై పలు పుస్తకాలను విడుదలచేసారు.
పొగాకు పత్యామ్నాయ పంటలపై అవగాహన - prakasam
పొగాకు వాడకంపై ఉన్న పరిస్థితులకు అనుగుణంగా, పొగాకు పంటల విస్తీర్ణం ను తగ్గించే చర్యలపై వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, పొగాకు బోర్డు సంయుక్త కార్యక్రమాలను నిర్వహించాయి.
పొగాకు పత్యామ్నాయ పంటలపై అవగాహన