ప్రకాశం జిల్లా గిద్దలూరులో జల శక్తి అభియాన్ ఆధ్వర్యంలో.. వ్యవసాయ రంగంలో నీటి సంరక్షణ పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. విద్యార్థులు నీటి వినియోగం, వన సంరక్షణ అంశాలపై నాటికను ప్రదర్శించారు. నీటిని పొదుపుగా వినియోగించుకోకపోతే భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాంబాబు మాట్లాడుతూ నీటి వినియోగం, పొదుపు, సంరక్షణపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. భవిష్యత్ తరాలకు మనం మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జల శక్తి అభియాన్ పథకానికి ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు. జలశక్తి అభియాన్ లో భాగంగా ప్రకాశం జిల్లా నుండి ఐదు మండలాలు ఎంపిక చేశారని.. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని సరఫరా చేసే పథకాలకు నిధులు మంజూరు చేస్తారని ప్రకటించారు.
నీటిని పొదుపు చేయకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే! - జలశక్తి అభియాన్‌పై గిద్దలూరులో అవగాహన సదస్సు
వ్యవసాయ రంగంలో నీటి సంరక్షణ పద్ధతులపై ప్రకాశం జిల్లాలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నీటి పొదుపుపై వేసిన నాటిక అందర్నీ ఆలోచింపజేసింది.
నీటి పొదుపు చేయకుంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమే!