ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రామసముద్రంలో కరోనా మహమ్మారిపై.. ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఆశావర్కర్లు ఇంటింటికీ తిరిగి.. మాస్కులు వాడాలని, శానిటైజరుతో చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని సూచించారు. స్వీయ పరిశుభ్రతతో కరోనా వైరస్‌ను అడ్డుకోవచ్చని తెలిపారు. బయటకు వస్తే వ్యక్తిగత దూరం పాటించాలని చెప్పారు.
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించిన వాలంటీర్లు - కరోనా వైరస్‌పై రామసముద్రం ప్రజలకు అవగాహన కార్యక్రమం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా రామసముద్రంలో వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి ప్రజలకు సూచనలు, సలహాలు ఇచ్చారు.
కరోనా వైరస్‌పై రామసముద్రం ప్రజలకు అవగాహన కార్యక్రమం