కరోనా వైరస్ పట్ల అధికారులు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రకాశం జిల్లా చిన్నగంజాంలో పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, సచివాలయ ఉద్యోగులు, గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ను నివారించవచ్చు? అనే విషయాన్ని చిన్నగంజాం ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకుడు హరిప్రసాద్ పాట రూపంలో వివరించారు. అందరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని.. అప్పుడే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించారు. సాధ్యమైనంత వరకూ అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని అన్నారు.
కరోనాపై చినగంజాంలో అధికారుల అవగాహన - corona
కరోనా వైరస్‌పై ప్రకాశం జిల్లా చినగంజాంలో వైద్య సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా అవగాహన చేపట్టారు. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.
కరోనాపై ప్రజలకు అవగాహన కార్యక్రమం