ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల కుటుంబాలతో చీరాల డీఎస్పీ సమావేశం - Awareness on Covid

కరోనా కట్టడిలో పోలీస్ సిబ్బంది అలుపెరుగని విధులు నిర్వహిస్తున్నారని ప్రకాశం జిల్లా చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి అన్నారు.

praksam district
పోలీస్ కుటుంబాలతో చీరాల డీఎస్పీ సమావేశం

By

Published : Jun 19, 2020, 9:18 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలో డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి పోలీసుల కుటుంబాలతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కరోనా నియమ నిబందనలను కచ్చితంగా పాటించాలని, తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీసు శాఖ నిరంతరం కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తోందని. అందువల్ల వైరస్ తమకూ సోకే ప్రమాదం ఉందని.. ఇంట్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి డీఎస్పీ అన్నారు.

జిల్లా ఎస్పీ సిద్దార్డ్ కౌశల్ ఉత్తర్వుల మేరకు చీరాల సబ్ డివిజన్ ,చీరాల రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని సిబ్బంది కుటుంబాలకు కోవిడ్ పై అవగాహన కలిపించారు. కార్యక్రమంలో చీరాల రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, వేటపాలెం, చీరాల, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది చదవండివారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు

ABOUT THE AUTHOR

...view details