పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు - addhanki news updates
ప్రకాశం జిల్లా అద్దంకిలో పర్యావరణంపై అవగాహన సదస్సు జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు
ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రకాశం జిల్లా అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ లోపించడం వల్లే సమతుల్యం దెబ్బతిని ప్రపంచం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని వక్తలు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించి, మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.