ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో ఆటోమెటిక్ థర్మల్ స్కానర్ ఏర్పాటు చేశారు. దాదాపు 10 అడుగుల దూరంలో వ్యక్తుల నుంచి ఉష్ణోగ్రతను ఈ మిషన్ స్కాన్ చేస్తుంది. అధిక ఉష్ణోగ్రత ఉన్నవారు వస్తే గుర్తించే విధంగా అలారం మోగుతుంది. వెంటనే సిబ్బంది వారిని పక్కకు పంపించి ఇతర పరీక్షలు నిర్వహిస్తారు. 99 డిగ్రీల లోపు ఉంటే కార్యాలయంలోకి యథావిధిగా వెళ్లిపోవచ్చని అధికారులు తెలిపారు. కలెక్టరేట్లో వివిధ విభాగాలకు వెళ్లే ఉద్యోగులు, సందర్శకులు ఈ స్కానర్ ద్వారా పరీక్షించుకుని లోపలకు రావాలని అధికారులు వెల్లడించారు. ఇందుకోసం కలెక్టర్ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు ఉండే వివిధ మార్గాలను మూసివేసి, ఒకే మార్గాన్ని తెరిచి, అక్కడ నుంచే రాకపోకలు ఏర్పాటు చేశారు.
ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో ఆటోమెటిక్ థర్మల్ స్కానర్ ఏర్పాటు - prakasam dst corona news
కరోనా బారిన పడకుండా వైద్యులు, అధికారులు అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు..ప్రజలకు చెపుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇప్పటివరకూ.. థర్మల్ స్కానర్ ద్వారా వ్యక్తి ఉష్ణోగ్రతలు చూశారు... ఇందుకు భిన్నంగా ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో ఆటోమెటిక్ థర్మల్ స్కానర్ ఏర్పాటు చేశారు. ఇది ఎలా పనిచేస్తుందో మీరు చూడండి...
automatic darmal scaner fixed in prakasam dst collector office
TAGGED:
prakasam dst corona news