ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో డ్రైవర్ నిజాయితీ.. నగదు అప్పగింత - మార్టూరులో ఆటో డ్రైవర్ నిజాయితి తాజా వార్తలు

ప్రకాశం జిల్లా మార్టూరులో ఓ మహిళ.. ఆటోలో ప్రయాణిస్తూ తన వద్దనున్న నగదు సంచిని మరిచిపోయింది. గమనించిన ఆటో డ్రైవర్.. ఆ సంచిన పోలీసులకు అప్పగించి తన నిజాయితిని చాటుకున్నాడు. తన కూతురి పెళ్లి కోసం బ్యాంకు నుంచి నగదు తెచ్చినట్లు బాధితురాలు తెలిపింది. డ్రైవర్​ను పోలీసులు అభినందించారు.

auto driver help
auto driver help

By

Published : May 5, 2021, 10:53 PM IST

ఓ మహిళ ఆటోలో ప్రయాణిస్తూ.. తన వద్దనున్న డబ్బుల సంచిని మరిచిపోయింది. గమనించిన ఆటో డ్రైవర్.. పోలీసులకు ఆ సంచిని ఇచ్చి తన నిజాయితిని చాటుకున్న ఘటన ప్రకాశం జిల్లా మార్టూరులో జరిగింది. మార్టూరు మండలం రాజుగారిపాలెంకు చెందిన పిలారీ గుణసుందరి అనే మహిళ.. తన కుమార్తె పెళ్లికోసం ఓ బ్యాంకులో బంగారం కుదకు పెట్టి..రూ.1.8లక్షలు తీసుకుని ఆటోలో ఇంటికి బయల్దేరింది.

డబ్బు, పర్సు మరచిపోయి.. గ్రామంలో దిగిపోయింది.. కొద్దిసేపటికి ఆటోలో డబ్బు మరిచిపోయిన విషయం గుర్తుకొచ్చి.. మార్టూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో పక్క డబ్బు, పర్సును చూసిన ఆటో డ్రైవర్ పలకతోటి రాజు.. ఈవిషయమై తోటి డ్రైవర్లతో చర్చించి పోలీసులకు అందజేశాడు. బాధితురాలికి పోలీసులు ఆమె సొమ్మును అందజేశారు. డ్రైవర్ రాజును అభినందించిన పోలీసులు.. కొంత నగదును అందించారు.

ABOUT THE AUTHOR

...view details