ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐస్​లోడ్​తో వెళుతున్న ఆటోలో మంటలు! - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణానికి సమీపంలో ఐస్ లోడ్ తో వెళ్తున్న ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సుమారు 2 లక్షల రూపాయలు విలువైన ఆటో కాలిపోయిందని యజమాని తెలిపారు.

auto caught fire due to electric shock near addanki town
విద్యుదాఘాతంతోదగ్ధమైన ఆటో

By

Published : May 17, 2020, 12:27 PM IST

ఒంగోలు నుంచి ఐస్​లోడ్​తో ప్రయాణిస్తున్న వాహనంలో... అద్దంకి సమీపానికి చేరగానే విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆటోలో ఉన్న వారు గమనించి కిందకి దిగి పరుగులు తీశారు.

విషయం తెలుసుకున్న అద్దంకి అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేశారు. సుమారు 2 లక్షల రూపాయల విలువైన ఆటో తగలబడిపోయిందని యజమాని గద్దె ప్రేమానందం ఆవేదన చెందారు.

ABOUT THE AUTHOR

...view details