ప్రకాశంజిల్లా తాళ్ళూరు మండలం బోద్దికూరపాడు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలలో జాతీయపతాకావిష్కరణ వినూత్నంగా జరిగింది. గత రాత్రి నుంచి తేలికపాటి జల్లులతో వర్షం కురుస్తోంది. తెల్లవారితే జెండా పండుగ జరుపుకోవాలి. బోద్దికూరపాడు గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ వేడుకలలో వింత పోకడ నెలకొంది. వర్షం పడుతున్నందువలన జాతీయపతాకం తడిచి పోతుందేమోనని పాఠశాల ఉపాధ్యాయులు పోల్ పై భాగాన గొడుగును ఏర్పాటు చేసి జెండాను ఎగురవేశారు. జాతీయ పతాకంపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు.
జాతీయపతాకానికి రక్షణగా ఛత్రం - august 15 celebration in prakasam
కరోనా ప్రభావంతో పాఠశాలలు, కళాశాలలు సైతం మూతబడ్డాయి. దీంతో పలు స్కూళ్లలో పంద్రాగస్టు వేడుకలు జరపలేకపోయారు. కరోనాకు తోడు వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. పలువురు తమకు అనుకూలమైన స్థలాల్లో జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నారు. కానీ ప్రకాశం జిల్లాలో వర్షాన్ని కూడా లెక్కచేయకుండా జెండాను తడవనివ్వకుండా జెండాను ఎగురవేశారు.
![జాతీయపతాకానికి రక్షణగా ఛత్రం జాతీయపతాకానికి రక్షణగా ఛత్రం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8436605-534-8436605-1597551456281.jpg)
జాతీయపతాకానికి రక్షణగా ఛత్రం