ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో రెండేళ్ల చిన్నారిపై.. అదే గ్రామానికి చెందిన మహేశ్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న మహేశ్... బాలికను ద్విచక్రవాహనంపై గ్రామానికి దూరంగా తీసుకువెళ్లాడు. కుమార్తె కనిపించకపోయేసరికి కంగారుపడిన తండ్రి.. మేదరమెట్ల పోలీసులకు సమాచారం అందించాడు.
మహేశ్ పై అనుమానంతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేశారు. అతడి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు పసిగట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేశారు. కక్షపూరితంగానే మహేశ్ ఈ పని చేశాడని ఆవేదన చెందాడు.